• facebook
  • whatsapp
  • telegram

Latest News: 13-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Entrance Exams: నీట్‌, జేఈఈ మెయిన్‌, సీయూఈటీ విలీనం! 

ఈనాడు, దిల్లీ: విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్‌, జేఈఈ మెయిన్‌ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ చెప్పారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. TSLPRB: ఎస్సై పరీక్షలో 8 ప్రశ్నల తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో నిర్వ‌హించిన  ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. TS EAMCET: 21 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగ‌స్టు 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన 23 నుంచి మొదలవుతుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

https://pratibha.eenadu.net/home/article_landing/education-job-information/ts-eamcet-counselling-from-21st-august/9-22010004369

4. TA EAMCET Results: టాపర్లలో అబ్బాయిలు.. ఉత్తీర్ణతలో అమ్మాయిలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ఎనిమిది మంది, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో ఏడుగురూ వారే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Para Medical: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో నర్సింగ్‌, ఫిజియోథెరపీ, ల్యాబ్‌ టెక్నాలజీ డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 12న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.