• facebook
  • whatsapp
  • telegram

Latest News: 27-09-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Medical Education: పీజీ వైద్య విద్యలో మళ్లీ ‘గ్రామీణ సేవ’!

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రామీణ/ప్రభుత్వ సేవను పునరుద్ధరించబోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఇది తప్పనిసరి కాబోతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Job Fair: 30న పెడనలో మెగా ఉద్యోగ మేళా

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ, సీడ్‌ ఏపీ, ఉద్యోగకల్పనా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబ‌రు 30న ఉదయం 9 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. IT Jobs: బీటెక్‌ రెండో ఏడాదే కొలువు బాట

ఈనాడు, హైదరాబాద్‌: చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల దీపం.. సాఫ్ట్‌వేర్‌ కొలువు. బీటెక్‌ నాలుగో సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుంది? మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది? అన్నదే వారి ఆందోళన.. ఆదుర్దా! కానీ.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Medical Colleges: బోధనార్థం.. ఇదం శరీరం

ఈనాడు, అమరావతి: కొన్ని దశాబ్దాల కిందట రక్తదానం చేయాలన్నా వెనకాడేవారు. తర్వాత క్రమంగా అవయవదానాలూ మొదలయ్యాయి. తమ ఆప్తులు జీవన్మృతులుగా మారినప్పుడు (బ్రెయిన్‌డెడ్‌) వారి శరీరంలోని అవయవాలను అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా తమవారిని అమరులను చేయొచ్చన్న అవగాహన పెరిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. TS EAMCET: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబ‌రు 28 నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. దాన్ని అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.