• facebook
  • whatsapp
  • telegram

Latest News: 01-10-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC: 92 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌- 1లో (జ‌న‌ర‌ల్‌/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌) 92 పోస్టుల భర్తీకి సెప్టెంబ‌రు 30న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. TSPolice: పోలీస్‌ నియామక మండలి పరీక్ష ఫలితాలు ఎప్పుడో..?

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్లస్థాయి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. ఆగస్టు 7న 554 ఎస్సై స్థాయి పోస్టులకు పరీక్ష జరగ్గా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Reservations: గిరిజన రిజర్వేషన్లు ఇక 10 శాతం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబ‌రు 30న‌ అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. UG, PG admissions: విదేశీ విద్యార్థులకు 25% సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని యూజీసీ గుర్తింపు పొందిన అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు యూజీ, పీజీ కోర్సుల్లో విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కోటా కింద కేటాయించవచ్చు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Distance Education: అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు సెప్టెంబ‌రు 30న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Group-1 Interviews: గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ  సెప్టెంబ‌రు 30న‌ ఉత్తర్వులు జారీచేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.