• facebook
  • whatsapp
  • telegram

Latest News: 04-10-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Medical Counselling: జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ 11 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు అక్టోబ‌రు 11 నుంచి, తెలంగాణ‌ రాష్ట్రంలో సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అక్టోబ‌రు 3న‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. TSRTC: ఆర్టీసీలో అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ (టీఎస్‌ఆర్టీసీ)లోని ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అక్టోబ‌రు 3న‌ ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. TS PGECET: సీట్ల కన్నా అభ్యర్థులే తక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 8,500 వరకు సీట్లు ఉండగా 5,568 మంది మాత్రమే అర్హులున్నారు. పీజీఈసెట్‌లో మొత్తం 11,938 మంది ఉత్తీర్ణులు కాగా 5,912 మంది ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. NEET PG: నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితా వెల్లడి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ ఎండీ/ఎంఎస్‌ సీట్లకు సంబంధించి కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితాను అక్టోబ‌రు 3న‌ విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Abroad Education: విదేశీ విద్య.. ‘మధ్య తరగతి’ ఎజెండా..

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం శతాబ్దాల నుంచి ఉన్నదే. అయితే ధనవంతుల బిడ్డలకు మాత్రమే ఫారిన్‌ చదువనే పరిస్థితి మాత్రం మారింది. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రతిభ ఉన్న తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.