1. TS Police: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు 8 నుంచి
ఈనాడు, హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో కీలకమైన రెండో దశ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) నవంబరు 27న తేదీలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాతపరీక్షలో అర్హులైన 2,37,862 మంది అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి తొలి వారం వరకూ శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్- పీఈటీ)లు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లు నిర్వహించనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Civil Assistant Surgeons: వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్
ఈనాడు, హైదరాబాద్: గతంలో వైద్యుల నియామకాల్లో అనుసరించిన విధానాల వల్ల పలు సమస్యలు వచ్చినందున.. ఈ దఫా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. నాలుగేళ్ల కిందట వైద్య విధానపరిషత్ పరిధిలో అభ్యర్థుల ప్రాధాన్యాలను పట్టించుకోకుండా..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. IIIT Admissions: ట్రిపుల్ ఐటీల్లో సీట్లన్నీ భర్తీ
నూజివీడు, న్యూస్టుడే: ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2022 - 23 విద్యా సంవత్సరానికి అన్ని సీట్లు భర్తీ అయినట్లు ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Anganwadi: అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
ఈనాడు, హైదరాబాద్: అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. న్యాయవివాదాలు పరిష్కారమవడంతో ఎంపికైన అభ్యర్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ నియామక పత్రాలను అందజేసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో అర్హత కలిగిన వారికి శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ గ్రేడ్-2గా పదోన్నతులు కల్పిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అ.. ఆ..లతో మెదడులో మార్పులు
ఈనాడు, హైదరాబాద్: మనిషి మెదడుపై అక్షరాస్యత ప్రభావం చూపగలదా? వయోజనుల్లోనూ ఉచ్చారణలో మార్పు తెస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్సీయూ) పరిశోధకులు. చదవడం, రాయడం నేర్చుకున్నప్పుడు మనిషి మెదడులో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నాయనే అంశంపై వర్సిటీ ఆచార్యులు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 91 మంది హిందీ మాట్లాడేవారిని ఎంచుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.