• facebook
  • whatsapp
  • telegram

Latest News: 05-12-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. పోలీసు ఉద్యోగాల ఎంపికకు 4 దశలు

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత నియామక నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం 4 దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. అగ్నిమాపక శాఖలో అతివలకు చోటేది?

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాలు సహా అనేక క్లిష్టమైన విధుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. అయినా పోలీస్‌శాఖలో అంతర్భాగమైన అగ్నిమాపకశాఖలో మహిళలకు రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఫైర్‌ ఉమన్‌, ఎస్సై, అధికారిగా లేరు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ప్రాణం పెట్టి చదవండి.. కొలువులు కొట్టండి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను పొందాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. బీటెక్‌లో భారీగా ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి బీటెక్‌లో చేరే వారి సంఖ్య బాగా పెరిగింది. ఒక్క కన్వీనర్‌ కోటా సీట్లలోనే గతేడాది కంటే 7 వేల మందికిపైగా ఎక్కువగా చేరినట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంసెట్‌ కన్వీనర్‌, యాజమాన్య కోటా కింద మొత్తం 82 వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. నేటి నుంచి డిగ్రీ స్పాట్‌ ప్రవేశాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో స్పాట్‌ ప్రవేశాలు డిసెంబ‌రు 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మూడు విడతల్లో నిర్వహించిన డిగ్రీ ప్రవేశాల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్‌ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.