• facebook
  • whatsapp
  • telegram

Latest News: 08-12-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. 247 పాలిటెక్నిక్‌ అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 247 అధ్యాపకుల ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిసెంబ‌రు 7న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 19 సబ్జెక్టుల్లో అధ్యాపకులను నియమించనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. అంతర్జాతీయ క్యాప్టివ్‌ కేంద్రాల్లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు

దిల్లీ: అంతర్జాతీయ క్యాప్టివ్‌ కేంద్రాలు (జీసీసీలు) ఉద్యోగులను పెంచుకోవడానికి చూస్తున్నాయి. వచ్చే 12 నెలల్లో ఇవి దాదాపు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోవచ్చని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ఇండియా క్యాప్టివేటింగ్‌ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 35.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్న జీసీసీ రంగం.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సులకు నేటి నుంచి రెండోవిడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్‌, పీబీ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీకి డిసెంబ‌రు 8న ఉదయం 9 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండోవిడత ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటన

ఈనాడు, అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. డిసెంబ‌రు 10లోపు యాజమాన్య కోటా 30 శాతం సీట్లను భర్తీకి అవకాశం కల్పించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. సహాయ ఆచార్యుల నియామకానికి ప్రకటన జారీ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 631 సహాయ ఆచార్యుల నియామకాలకు ప్రకటన విడుదల చేసినట్లు వైద్య విద్య సంచాలకుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. డిసెంబ‌రు 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో.....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.