1. ఒక్కరోజులో 58,845 దరఖాస్తులు!
గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు జనవరి 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 8,00,004కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 70% సిలబస్సే
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే ప్రాక్టికల్స్ ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 100% సిలబస్ ఆధారంగా జరుగుతాయని ఇంటర్‌బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రైవేటులో గ్రూప్స్ శిక్షణ ఆర్థికభారం
రాష్ట్రంలో ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ పోటీపరీక్షలకు శిక్షణ ఆర్థిక భారంగా మారుతోంది. వరుస ఉద్యోగ ప్రకటనలతో హైదరాబాద్‌కు వస్తున్న యువత వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రైవేటులో శిక్షణకు ఫీజులు చెల్లించలేని స్థాయిలో ఉంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
4. 7 నుంచి ఫార్మెటివ్-3 పరీక్షలు
ఫార్మెటివ్-3 పరీక్షలను ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా (సీబీఏ) విధానంలో ఓఎమ్మార్ షీట్‌తో నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
5. ఉపకారవేతన మాదిరి పరీక్ష
జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) మాదిరి ప్రశ్నపత్రంతో స్కూల్ అసిస్టెంట్స్ సంఘం తరఫున జనవరి 29న విద్యార్థులకు పరీక్ష నిర్వహించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరోత్తమరెడ్డి, చింతల సుబ్బారావు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.