• facebook
  • whatsapp
  • telegram

Latest News: 27-03-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతం

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న‌ నిర్వహించిన పోలీస్‌ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 975 మంది అభ్యర్థులకు 594 మంది(60.92శాతం) హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌, డిజిటల్‌ వేలిముద్రల్ని సేకరించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. రహస్యంగా బేరసారాలు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు తెర వెనుక వ్యవహారం నడిపించారు. కమిషన్‌ కార్యాలయం నుంచి ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి ద్వారా గ్రూప్‌-1, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ ప్రశ్నపత్రాలు చేతికందగానే తమ పరిచయాలను ఉపయోగించి కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్థులతో గుట్టుగా బేరసారాలాడారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. లండన్‌లో స్టడీటూర్‌కు తెలంగాణ విద్యార్థినులు

తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్‌ కౌన్సిల్‌ల మధ్య ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 15 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థినులు స్టడీ టూర్‌ కోసం మార్చి 26న‌  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి అయిదుగురు, సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఆరుగురు, గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి నలుగురు ఈ బృందంలో ఉన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

4. ప్రణాళికతో చదివితే పదిలో విజయం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రీఫైనల్‌ రాసి ఉన్నారు. పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తుండటంతో ఒకింత భయం, ఆత్మవిశ్వాసం వారిలో తొణికిసలాడుతోంది. ఏప్రిల్‌ 3న ప్రారంభమయ్యే వాటికి ఏడు....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.