• facebook
  • whatsapp
  • telegram

Latest Results: 16-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: పండగల గిరాకీని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా కొత్తగా 66 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీంతోపాటు కొత్తగా 1.5లక్షల సీజనల్‌ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. JEE Advanced: జేఈఈ నిబంధనపై  ఫిర్యాదు చేసుకోవచ్చు

* విద్యార్థులకు సుప్రీంకోర్టు సూచన

దిల్లీ: జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) - 2021 ప్రవేశ నిబంధనల్లో అభ్యంతరం ఉన్న అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యార్థులకు సూచించింది. 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు మాత్రమే జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)కు అర్హులంటూ నిబంధన విధించడం సరికాదంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. LAWCET: లాసెట్‌లో 68.84 శాతం ఉత్తీర్ణత  

ఈనాడు, హైదరాబాద్‌: లాసెట్‌ రాసిన వారిలో 68.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 39,805 మంది దరఖాస్తు చేసుకోగా 29,629 మంది పరీక్ష రాశారు. వారిలో 20,398 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెప్టెంబ‌రు 15న‌ ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఫలితాలను విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. AP PGCET: ఏపీ పీజీ సెట్‌ షెడ్యూలు విడుదల  

యోగి వేమన విశ్వవిద్యాలయం(కడప), న్యూస్‌టుడే: ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీజీసెట్‌) - 2021 షెడ్యూలును కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి మునగాల సూర్యకళావతి సెప్టెంబ‌రు 15న‌ విడుదల చేశారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లోని కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్లు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. అగ్రిసెట్‌లో 2,538 మంది ఉత్తీర్ణత 

ఈనాడు, అమరావతి: అగ్రిసెట్‌ - 2021 ఫలితాలు సెప్టెంబ‌రు 15న‌ విడుదలయ్యాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌ నుంచి అల్లు రమ్య (మార్టేరు), నంబూరి ప్రసాద్‌ (తణుకు), గుదేటి సురేంద్రవర్మ (గరికపాడు), విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌ నుంచి చందా అనున్య (రుద్రూరు, తెలంగాణ), వన్నెల భూమరాజు (తునికి, తెలంగాణ), కొండపర్తి రమ్యశ్రీ (రుద్రూరు, తెలంగాణ), సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌ నుంచి మువ్వల గంగా భవాని (చింతపల్లి), లాలం దేవి (చింతపల్లి), గొల్లపల్లి గీతసాయి (చింతపల్లి) అధిక మార్కులు సాధించి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 16-09-2021