• facebook
  • whatsapp
  • telegram

automotive retail courseను అందించ‌నున్న మారుతి, టీఐఎస్ఎస్  

2021 అక్టోబరులో కోర్సు ప్రారంభం

ఆటోమోటివ్ రిటైల్‌లో యువతకు శిక్షణ ఇవ్వడానికి ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్-స్కూల్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (టిస్-ఎస్‌వీఈ) తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) తెలిపింది.
కోర్సు వివ‌రాలు..
ఎంఎస్ఐ ఒప్పందం ప్ర‌కారం టిస్-ఎస్‌వీఈతో క‌లిసి రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ఆటోమోటివ్ రిటైల్‌ స్పెషలైజేషన్ కు సంబంధించి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సు యువ‌త‌కు రిటైల్ ఉద్యోగానికి అవ‌స‌ర‌మైన‌ సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్ ను అందించడంపై దృష్టి సారిస్తుంది.
కోర్సుతో పాటు తప్పనిసరిగా 24-నెలల పాటు ఉద్యోగ శిక్షణను అందిస్తారు. ఇది విద్యార్థికి లోతైన పరిజ్ఞానాన్ని అందించి, వాస్తవ జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధం చేయడంతో పాటు ప‌రిశ్ర‌మ‌లో ప‌ని వాతావ‌ర‌ణాన్ని అల‌వాటు చేస్తుంది.
మూడు సంవత్సరాల కోర్సులో మారుతి సుజుకీ అధీకృత డీలర్‌షిప్‌లలో ఒక సంవత్సరం తరగతుల్లో శిక్షణ, రెండు సంవత్సరాలు ఉద్యోగ శిక్షణ ఉంటుంది.
2021-22 విద్యా సంవత్సరం కి సంబంధించి మొదటి బ్యాచ్ 2021 అక్టోబరు నుంచి ప్రారంభమవుతుంది.

Posted Date : 28-09-2021