• facebook
  • whatsapp
  • telegram

MBA Exams: నేటి ఎంబీఏ పరీక్షలు వాయిదా

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఒకే రోజు రెండు పరీక్షల కారణంగా ఆందోళనకు లోనవుతున్న ఎంబీఏ విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది. ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఉన్న రోజునే యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహిస్తోంది. దీనిపై ‘ఒకే రోజు రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు’ శీర్షికన సెప్టెంబ‌రు 29న‌ ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం కంట్రోలర్‌.. సెప్టెంబ‌రు 30న‌ జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబ‌రు 30న జరగాల్సిన పరీక్షలను అక్టోబరు 11న నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.