• facebook
  • whatsapp
  • telegram

MBBS: వైద్యవిద్య అర్హత పరీక్ష ధ్రువపత్రాల సమర్పణకు గడువు 22

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వైద్య వృత్తిని కానీ, ఉన్నత వైద్య విద్యాభ్యాసాన్ని కానీ కొనసాగించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా అర్హత పరీక్ష ఉత్తీర్ణత కావాలి. ఈ పరీక్షను డిసెంబరు 12న నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలంటే ముందుగా అక్టోబర్‌ 22లోపు తమ విద్యార్హతకు సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలను జాతీయ వైద్య కమిషన్‌కు సమర్పించాలి. ఈ మేరకు అక్టోబర్‌ 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. అర్హత ధ్రువపత్రాలను నిర్దేశిత గడువు తేదీ లోపు సమర్పించిన అభ్యర్థులకే పరీక్ష రాసే అవకాశం ఉంటుందని జాతీయ వైద్య కమిషన్‌ స్పష్టం చేసింది. అసంపూర్తి సమాచారంతో పంపించే దరఖాస్తులు పరిశీలించే అవకాశం ఉండదని కమిషన్‌ పేర్కొంది. 

Posted Date : 14-10-2021