ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. నవంబరు 30న రాత్రి 7 గంటల నుంచి డిసెంబరు 01 రాత్రి 7 గంటల వరకూ అభ్యరులు ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
7 వరకూ ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తులు
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్యవర్సిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 1న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకేసారి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?
‣ ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నెగ్గేదెలా?
‣ టెన్త్‌తో రక్షణదళంలో ఉద్యోగం
‣ డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్ల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.