• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ‌లో 894 మెడిక‌ల్ పోస్టులు

వాక్‌-ఇన్ ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంపిక‌లు

 

తెలంగాణ‌లోని వైద్య కళాశాలలు, జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రుల్లో మొత్తం 894 మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. గాంధీ, ఉస్మానియాతోపాటు వివిధ జిల్లాల్లోని మెడిక‌ల్ క‌ళాశాల‌లు, ఆసుప‌త్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు 573, ట్యూట‌ర్లు 40, ఫార్మ‌సిస్టులు 79, ల్యాబ్ అసిస్టెంట్లు 202 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో ఆయా పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థుల‌కు వాక్‌-ఇన్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఎంపిక చేస్తారు.