• facebook
  • whatsapp
  • telegram

Merit: మెరిట్‌లిస్ట్‌లో వారు చేరకుంటే..

* తదుపరి అభ్యరులకు అవకాశం 
* తెలంగాణలో 1,370 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సుప్రీం పచ్చజెండా 
* గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సమరన 

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేస్తూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. దీనివల్ల 1,370 మంది అభ్యరులకు ఊరట లభించనుంది. వివిధ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం 2018 మే 5వ తేదీన నోటిఫికేషన్‌ ప్రకారం పలువురు అభ్యరులు దరఖాస్తు చేసుకున్నారు. 2019 సెప్టెంబరు 24న తుది మెరిట్‌ లిస్ట్‌ జారీ అయింది. అందులోని వారంతా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు పొందారు. ఇందులో ఎక్కువ అర్హత మార్కులు పొందినవారు ఈ పోస్టుల్లో చేరడానికి రాకపోవడంతో ప్రభుత్వం వాటిని ఖాళీగా ఉంచింది. అయితే మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి సానంలో ఉన్న తమను పరిగణనలోకి తీసుకోలేదంటూ కొందరు అభ్యరులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనివల్ల 1,370 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. మెరిట్‌ లిస్ట్‌లో ముందున్నవారు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకొన్న తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఉంటే దాన్ని ఖాళీగా భావించి తదుపరి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం భర్తీ చేయాలి తప్పితే, అసలు అభ్యరే చేరని పోస్టును ఖాళీగా ప్రకటించి, దాన్ని మెరిట్‌లిస్ట్‌లో తదుపరి జాబితాలో ఉన్నవారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు మెరిట్‌ లిస్ట్‌లో తొలిసానంలో ఉన్నవారు చేరని పోస్టులను మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి సానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాన్ని సవాల్‌చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేసింది. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారు నియామక ప్రక్రియలో పాల్గొని అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్న తర్వాత చేరకపోతే మాత్రమే దాన్ని ఖాళీ అయిన పోస్టుగా పరిగణించాలని, మెరిట్‌లిస్ట్‌లో తర్వాతి క్రమంలో ఉన్నవారితో భర్తీ చేయకూడదని ముంజా ప్రవీణ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ కేసులో కోర్టు ఇదివరకే స్పష్టం చేసినందున దాన్నే అనుసరించాలంది. యువత ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్య వనరు అని.., అందువల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పును సమరిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.