• facebook
  • whatsapp
  • telegram

నూతన విద్యా విధానంపై 29న ప్రసంగించనున్న మోదీ   

 

దిల్లీ: దేశంలో నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జులై 29న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు తగ్గట్టుగా బలమైన పునాదులు వేసి, విద్యారంగాన్ని సమూలంగా మార్పు చేయడానికి ఈ విధానం మార్గదర్శిగా ఉందని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు. విధానం అమల్లో ఇంతవరకు సాధించిన పురోగతిని ప్రధాని తన ప్రసంగంలో వివరించి, మార్గసూచీని వెల్లడించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
 

Posted Date : 27-07-2021