• facebook
  • whatsapp
  • telegram

MSK: ప్రశాంతంగా ఎంఎస్‌కేల ఆన్‌లైన్‌ పరీక్షలు

తిరుపతి (నేరవిభాగం): గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు (ఎంఎస్‌కే) ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పరీక్షలు సెప్టెంబరు 23న ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలోని 292 మంది మహిళా పోలీసులకు డిపార్ట్‌మెంట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు తిరుపతి ఎస్వీ, అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిర్వహించారు. కేంద్రాలను ఎస్పీ వెంకట అప్పలనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా సంరక్షణ కార్యదర్శులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని పోలీసు వ్యవస్థలో విలీనం చేస్తూ.. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి డిక్లరేషన్‌ అందజేస్తామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ సుప్రజ పరీక్షలను పర్యవేక్షించగా.. డీఎస్పీలు రామరాజు, నరసప్ప, రామచంద్ర, నాగసుబ్బన్న, సీఐలు అబ్బన్న, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు విధులు నిర్వహించారు.

Posted Date : 24-09-2021