• facebook
  • whatsapp
  • telegram

National Economics Olympiad: నేషనల్ ఎకనామిక్స్ ఒలింపియాడ్

దిల్లీ యూనివర్సిటీకి చెందిన‌ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్‌సీసీ) 11, 12 తరగతుల విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి నేషనల్ ఎకనామిక్స్ ఒలింపియాడ్ (ఎన్ఈఓ)- 2021కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో ఒక్కో త‌ర‌గ‌తి నుంచి మొద‌టి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల‌కు ఒక్కొక్క‌రికి రూ. 65,000 చొప్పున న‌గ‌దు బ‌హూక‌రిస్తారు. పాల్గొన్న‌ ప్ర‌తి విద్యార్థి స‌ర్టిఫికెట్‌ పొందుతారు. ఎస్ఆర్‌సీసీ, ఆన్‌లైన్ ట్యూట‌ర్ ప్లాట్‌ఫామ్‌ వేదాంతు క‌లిసి ఈ ఒలింపియాడ్‌ను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు త‌ర‌గ‌తిగ‌దిలో నేర్చుకున్న‌ అర్థ‌శాస్త్రాన్ని ప్రపంచ వికాస తోడ్పాటుకు ఏవిధంగా అన్వ‌యిస్తారో త‌మ‌ను తాము ప‌రీక్షించుకోవ‌డానికి ఈ ఒలింపియాడ్ అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది.

రెండు రౌండ్ల‌లో...

నేషనల్ ఎకనామిక్స్ ఒలింపియాడ్ పోటీ 2021 అక్టోబరు 17, 24న‌ ఆన్‌లైన్ లో రెండు రౌండ్ల‌లో జ‌రుగుతుంది. 

మొద‌టి రౌండ్‌: ఇది ప్రిలిమినరీ రౌండ్‌. నాలుగు విభాగాలు ఉంటాయి - ఆర్థిక అంశాలు, లాజికల్ రీజనింగ్, కేస్ స్టడీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఒక్కో విభాగం నుంచి 10 ప్రశ్నలు అంటే మొత్తం 40 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగటివ్ మార్కింగ్ ఉండదు. స‌మ‌యం 60 నిమిషాలు.

రెండో రౌండ్: ఇది ఆశ్చర్యకరమైన రౌండ్, దీని వివరాలు పరీక్ష సమయంలో మాత్రమే తెలియ‌జేస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200. అయితే సెప్టెంబ‌రు 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.189 చెల్లిస్తే స‌రిపోతుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 15

రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

‣ I owe it all to my mother

Posted Date : 22-09-2021