• facebook
  • whatsapp
  • telegram

NEET PG: నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితా వెల్లడి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ ఎండీ/ఎంఎస్‌ సీట్లకు సంబంధించి కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితాను అక్టోబ‌రు 3న‌ విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరానికి.. మొత్తం 2,513 సీట్లకుగాను జాతీయ కోటా పోను మిగిలిన వాటిలో సర్వీస్‌ కేటగిరీలో 266 మందికి, నాన్‌-సర్వీస్‌ కోటాలో 822 మందికి సీట్ల కేటాయించినట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు అక్టోబ‌రు 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఆల్‌ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరే గడువును అక్టోబ‌రు 7వ తేదీ వరకు పొడిగించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

‣ తడబడకుండా ప్రసంగం

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.