• facebook
  • whatsapp
  • telegram

New courses: పీబీ సిద్ధార్థ కళాశాలలో నూతన కోర్సులు 

మొగల్రాజపురం(విజయవాడ సిటీ): ఈ విద్యాసంవత్సరం (2021-22) నుంచి బీఎస్సీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, బీకామ్‌(బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌), ఎమ్మెసీ డేటా సైన్స్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్‌ మేకా రమేష్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 25న కళాశాలలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డైరెక్టర్‌ వేమూరి బాబురావు మాట్లాడుతూ అధునాతన పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకాలీన నైపుణ్యాలను పాఠ్యంశాలలో జోడించి కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. డీన్‌ ఆచార్య రాజేష్‌ సి.జంపాల , కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి టీఎస్‌ రవికిరణ్, ఉపవిభాగాధిపతి కావూరి శ్రీధర్, కామర్స్‌ ఉపవిభాగాధిపతి కోనా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

 

Posted Date : 26-09-2021