ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలలో 40మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 6, 7, 8, 9 తరగతుల్లో ఒక్కో తరగతికి 10 మంది చొప్పున ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు జులై 3న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు జులై 9లోగా పాఠశాల హెచ్ఎంను కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఎక్కువ వస్తే జులై 10న పాఠశాల ప్రాంగణంలో ప్రతిభా పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.