* ముఖ్యమంత్రి ఆమోదానికి ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి. అన్ని జిల్లాల్లో, శాఖాధిపతుల కార్యాలయాల్లో కిందిస్థాయిలోని ఈ పోస్టులు చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలన పరమైన సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం నిర్ణయం మేరకు నోటిఫికేషన్‌పై తుది నిర్ణయం తీసుకునే వీలుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గ్రూపు-4 పోస్టుల భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలం తర్వాత గ్రూపు-1 పోస్టులు భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారు.
********************************************************
స్టడీమెటీరియల్
1. నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
5. భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం
6. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
7. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
8. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
9. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం
‣ పోలీసు ఉద్యోగ పరీక్షలకు ఇదీ సిలబస్!
‣ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సిలబస్, పరీక్షావిధానం, పోస్టుల వర్గీకరణ
‣ నీట్లో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.