• facebook
  • whatsapp
  • telegram

Civils: సివిల్స్‌ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో శిక్షణ    

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా సివిల్స్‌- 2022 పరీక్ష శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారం తెలిపారు. తొమ్మిది నెలలు ఆన్‌లైన్‌ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25 నుంచి అక్టోబరు 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


 

Posted Date : 26-09-2021