• facebook
  • whatsapp
  • telegram

AP Jobs: ఏపీలో త్వరలో 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష

 

 

అమరావతి: జాబ్‌ క్యాలెండర్‌పై వివిధశాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. ఏడాది కాలంగా రిక్రూట్‌మెంట్‌ సహా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా సమీక్షించారు. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌పై సమగ్రంగా సీఎం చర్చించారు. 2021-22 ఏడాదిలో 39,654 పోస్టులు భర్తీ చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ఈ ఒక్క ఏడాదిలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఇంకా సుమారు 8వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని, పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

 

వైద్యారోగ్యశాఖలో మిగిలిన పోస్టులను జూన్‌ చివరినాటికి భర్తీ చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా భర్తీ చేయాలన్నారు. ఏపీపీఎస్సీలో పోస్టులను వచ్చే ఏడాది మార్చిలోగా భర్తీచేయాలని సీఎం నిర్దేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆసుపత్రులు, విద్యాలయాలు కడుతున్నామన్న సీఎం.. అక్కడ ఖాళీలు భర్తీ చేయకపోవడం సరికాదని, భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవన్నారు. ఉన్నత విద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా దీన్ని రూపొందించుకోవాలన్నారు. వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలని, కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.