• facebook
  • whatsapp
  • telegram

పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు తెరిచేందుకు అనుమతి  

 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలను తెరవనుంది. తొలిదశలో పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కొవిడ్‌ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు వసతి కల్పించాలని ప్రభుత్వం జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు దసరా పండగ తరువాత విద్యార్థులు బసచేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నుంచి నిధులు కూడా విడుదలయ్యాయి. దీంతో గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖలు పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి.
 

Posted Date : 13-10-2021