• facebook
  • whatsapp
  • telegram

18 నుంచి కేయూ పీజీ ప‌రీక్ష‌లు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న రెగ్యులర్‌ పీజీ కోర్సుల్లో ఆగస్టు 18 నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ ఆగస్టు 3న పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్సీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని విరించారు. ఆగస్టు 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌-2019 నిబంధలన ప్రకారం పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పూర్తి వివరాలను కేయూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.

Posted Date : 04-08-2021