• facebook
  • whatsapp
  • telegram

6 నుంచి పాలిసెట్ ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: పాలిసెట్‌ - 2021 ప్రవేశాలకు సంబంధించి ధ్రువ పత్రాల పరిశీలన ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ముందుగా ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.అప్పారావు తెలిపారు. ఇందుకు ఆగస్టు 5 నుంచి 9 వరకు అవకాశం ఇచ్చారు. ధ్రువ పత్రాల పరిశీలన ఉజ్వల పార్కు సమీపంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలోని సహాయ కేంద్రంలో ఆగస్టు 10 వరకు జరుగుతుంది. అనంతరం 12 వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలి. 14న సీట్లను కేటాయిస్తారు. 

Posted Date : 05-08-2021