• facebook
  • whatsapp
  • telegram

ఆగ‌స్టు 5 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలీసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ జులై 27న‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. రెండు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం ప్రైవేట్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు మొదలుపెడతారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి.

మొదటి విడత  కౌన్సెలింగ్‌ కోసం ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు చేసుకోవాలి. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఇచ్చుకోవాలి. 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. చివరి విడత కౌన్సెలింగ్‌ కోసం ఆగస్టు 23న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు చేసుకోవాలి. 24న ధ్రువపత్రాల పరిశీలన, 24, 25 తేదీల్లో ఆప్షన్ల నమోదు, 27న సీట్ల కేటాయింపు ఉంటుంది.
 

‣ జులై 28న‌ పాలిసెట్‌ ఫలితాలు

పాలిసెట్‌ ఫలితాలను జులై 28వ తేదీన‌ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని కన్వీనర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. 92,556 మంది పరీక్ష రాశారు. ఈసారి బాసరలోని ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీకి కూడా ఈ ర్యాంకులే ఆధారం.

Posted Date : 27-07-2021