• facebook
  • whatsapp
  • telegram

Non Teaching staff: బోధనేతర సిబ్బంది పదోన్నతులకు చర్యలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లో బోధనేతర సిబ్బందికి జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆర్జేడీలను ఇంటర్‌ విద్యాశాఖ వివరాలు కోరింది. జూనియర్‌ లెక్చరర్ల ఖాళీల్లో 10శాతం బోధనేతర సిబ్బందితో భర్తీ చేయాలి. 2016 తర్వాత ఈ ప్రక్రియ జరగలేదు. జూనియర్‌ కళాశాలల్లో మంజూరైన పోస్టుల్లో 10శాతం కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయి? ఎన్ని పోస్టులను ఈ కోటాలో భర్తీ చేశారు? తదితర వివరాలను పంపించాలని సూచించింది. 

Posted Date : 19-09-2021