ఈనాడు, హైదరాబాద్: పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్(పీటీవో)లో ఎస్సై ఉద్యోగాల ఎంపికకు సంబంధించి మార్చి 26న రాత పరీక్ష (టెక్నికల్ పేపర్) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం(మార్చి 19) ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. హాల్‌టికెట్లను మార్చి 21 ఉదయం 8 నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దానిపై అభ్యర్థులు తమ పాస్‌పోర్టు సైజ్ ఫొటో అంటించాలని, లేనిపక్షంలో దాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకుంటే support@tslprb.inకి ఈ-మెయిల్ చేయడం, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఇదే ఉద్యోగానికి సంబంధించి నిర్వహించబోయే తదుపరి రెండు పరీక్షలకు హాల్‌టికెట్లు వేర్వేరుగా జారీ చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.