• facebook
  • whatsapp
  • telegram

డీఎన్‌బీ సీట్లలో ఇన్‌సర్వీస్‌ వైద్యుల కోటా  

 

ఈనాడు-అమరావతి: నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) నుంచి గుర్తింపు పొందిన జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహించే పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డీఎన్‌బీ, పోస్ట్‌ డిప్లొమా డీఎన్‌బీ, పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డిప్లొమా కోర్సుల్లో ఇన్‌సర్వీస్‌ వైద్యులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారాన్ని పంపించింది. పోస్టు ఎంబీబీఎస్‌ డీఎన్‌బీ కోర్సుల్లో 19 సీట్లు ఉండగా 9 ఇన్‌సర్వీస్‌ వైద్యులకు కేంద్రం కేటాయించింది. పోస్ట్‌ డిప్లొమా డీఎన్‌బీలో 13 సీట్లు ఉండగా ఆరింటిని ఇన్‌ సర్వీస్‌ వైద్యులతో భర్తీ చేస్తారు. పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డిప్లొమా సీట్లు 11 ఉండగా ఇన్‌ సర్వీస్‌ వైద్యులకు ఐదు సీట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఈ తరహా కోర్సుల్లో ఇన్‌ సర్వీస్‌ వైద్యులకు ప్రవేశాలు లేవు. ఈ సీట్ల భర్తీ ఎలా జరగాలి? రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఎలా? అనుసరించనున్న ఇతర విధివిధానాలపై వైద్య విద్య సంచాలకుల కార్యాలయం, ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్య శాఖ మధ్య చర్చలు పూర్తయితేనే స్పష్టత వస్తుంది. రాజమహేంద్రవరం, నంద్యాల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఈ సీట్ల భర్తీ జరుగుతుంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

‣ అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

Posted Date : 20-09-2021