• facebook
  • whatsapp
  • telegram

RCET: అదనపు అర్హతలే అడ్డంకి!

* పీహెచ్‌డీ ప్రవేశాల్లో నెట్, స్లెట్, ఎంఫిల్‌ ఉన్నవారికి 25% సీట్లే

* పీజీ అర్హతకు 75% ప్రవేశాలు

* ఉన్నత విద్యామండలి నిబంధన

 

 

ఈనాడు, అమరావతి: ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్‌సెట్‌) నిబంధనలు అదనపు అర్హతలు ఉన్నవారికి అడ్డంకిగా మారాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఆర్‌సెట్‌ రాసేవారికి 75 శాతం, జాతీయ అర్హత పరీక్ష (నెట్‌), జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), నెట్, రాష్ట్ర అర్హత పరీక్ష (స్లెట్‌), టీచర్స్‌ ఫెలోషిప్, ఎంఫిల్‌ లాంటి అదనపు అర్హతలు ఉన్న అభ్యర్థులకు 25 శాతం సీట్లను కేటాయించారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. నెట్, స్లెట్, ఎంఫిల్‌ అర్హతలు ఉన్న వారికి 60 శాతం, ఇతర పీజీ అభ్యర్థులకు 40 శాతం సీట్లు కేటాయించాలి. ఈ మార్గదర్శకాలను ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ పంపించింది. ఇది ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందలేదంటూ ఉన్నత విద్యా మండలి 25 శాతం సీట్లనే కేటాయించింది. ప్రస్తుత యూజీసీ నిబంధనల ప్రకారమైనా అదనపు అర్హతలున్న అభ్యర్థులకు పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని పట్టించుకోకుండా సీట్లు కేటాయిస్తున్నారు. సెప్టెంబర్‌ 24 వరకు ఆర్‌సెట్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.5వేల ఆలస్య రుసుముతో అక్టోబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో వాటిని ప్రస్తావించాలా? లేక కేవలం పీజీ ఉందని పెట్టాలా అనే దానిపై అయోమయానికి గురవుతున్నారు. 

 

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు 

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యామండలి పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు, ప్రవేశాలు నిర్వహిస్తోందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డికి వినతులు సమర్పించారు. మరోవైపు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్‌సెట్‌ను అక్టోబరు 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ఆర్‌సెట్‌లోనూ నెట్, స్లెట్‌లాంటి అర్హతలున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. దరఖాస్తు సమయంలో ఈ సీట్ల కేటాయింపు చెప్పకపోవడంతో అందరూ అదనపు అర్హతలను దరఖాస్తులో పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ సమయంలో ఈ విధానాన్ని పేర్కొనడంతో వీరందరూ 25 శాతం కోటాలోకి వెళ్లిపోయారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.