ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆర్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఫిబ్రవరి 9వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్‌లోడ్ 9-11, ధ్రువపత్రాల పరిశీలన 10-12, వెబ్‌ఐచ్ఛికాలు 13-15, సీట్ల కేటాయింపు 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20 నుంచి 24లోపు కళాశాలల్లో చేరాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.