• facebook
  • whatsapp
  • telegram

AP JOBS: పారదర్శకంగా నియామకాలు: సీఎం జగన్‌

ప్రతివారం ఒక్కో వీసీతో చర్చించాలని ఆదేశాలు

 

అమరావతి: నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదని.. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. బోధన సిబ్బందిలో నాణ్యతతో పాటు ఉన్నత ప్రమాణాలు ఉండేలా నియామకం ఉండాలన్నారు. ఈ మేరకు ప్రతివారం ఒక్కో వీసీతో మాట్లాడాలని ఉన్నత విద్యామండలిని సీఎం ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వర్సిటీలు సమన్వయం కావాలని సీఎం సూచించారు. వర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ తోడ్పాటుపై వీసీలతో చర్చించాలని.. సమావేశాల్లో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

Posted Date : 25-10-2021