ఈనాడు, హైదరాబాద్: ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూన్ 28న ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ నంబరు 5/2018లో దరఖాస్తు చేసినవారిని ఎంపిక చేసినట్లు తెలిపింది. పూర్తివివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూడాలని సూచించింది.
ANM Results: ఏఎన్ఎం పోస్టుల ఫలితాల విడుదల
Posted Date : 29-06-2022