• facebook
  • whatsapp
  • telegram

Contract Lecturers: ఒప్పంద ఆచార్యులను ఆదుకోండి

అలంకార్‌కూడలి(విజయవాడ): విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద ఆచార్యులకు కనీస మూల వేతనం అమలు చేయాలని కోరుతూ ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఛైర్మన్‌ ఎ.వి.నాగేశ్వరరావు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు అక్టోబరు 25న రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. జీవో ఎంఎస్‌ నెం.40 ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు మూలవేతనం అమలు చేయాలని అధికారులు సిఫారుసు చేసినా, ప్రయోజనం లేదన్నారు. జీవో ఎంఎస్‌ నెం.12 ప్రకారం విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న వారికి మూలవేతనం అమలు చేయాలని ఆదేశించినా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి మినిమం టైం స్కేల్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Posted Date : 26-10-2021