• facebook
  • whatsapp
  • telegram

SBI క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2021 విడుదల  

ఎస్‌బీఐ క్లర్క్ జూనియర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 2021 జూలై, ఆగస్టు నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు 2021  సెప్టెంబ‌రు 21న విడుద‌ల కాగా, సెప్టెంబ‌రు 22న ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డ్‌ల‌ను విడుద‌ల చేశారు. మెయిన్స్ ప‌రీక్ష‌ అక్టోబరు 1 నుంచి 17 వరకు జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ - sbi.co.in/careers ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప‌రీక్షా విధానం:

ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్‌కు పరీక్షా సమయం రెండు గంటల నలభై నిమిషాలు ఉంటుంది. ఇందులో జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి 190 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి.

ఈ ప‌రీక్ష ద్వారా ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 18 వివిధ సర్కిళ్లలోని క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ కోసం 5,000 పైగా ఖాళీలను భర్తీ చేయ‌నుంది. మెయిన్స్ పరీక్ష పాసైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. త‌ర్వాత‌ ఇంటర్వ్యూ రౌండ్‌ కూడా క్లియర్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ఎస్‌బీఐ శాఖల్లో నియ‌మితుల‌వుతారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ సిటీ కళాశాలకు అటానమస్‌ హోదా

‣ ఉపాధి అవకాశాలపై అవగాహన

‣ పరిశ్రమకు ప్రోత్సాహం... ఉపాధికి ఊతం!

Posted Date : 22-09-2021