• facebook
  • whatsapp
  • telegram

SBI Clerk Prelims Result: ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ ఫలితాలు వెల్లడి  

ఎస్‌బీఐ క్లర్క్ జూనియర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 2021 జూలై, ఆగస్టు నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను, మెరిట్ లిస్ట్‌ను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్, ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

 

త్వరలో మెయిన్స్ షెడ్యూల్:

ఎస్‌బీఐ మెయిన్స్ ఎగ్జామ్‌కు సంబంధించి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీ, సమయం, వేదిక వంటి సమాచారాన్ని విడుదల చేయనుంది. ఇక మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ టెస్ట్, లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఇంటర్వ్యూ రౌండ్‌కు ముందు జరుగుతుంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 339 అప్రెంటిస్‌లు

ఆల‌స్యం వ‌ద్దు... అల‌క్ష్యం అస‌లే వ‌ద్దు!

Posted Date : 22-09-2021