• facebook
  • whatsapp
  • telegram

Scholarships: ఉపకారవేతన దరఖాస్తు గడువు పొడిగింపు?

3 నెలలు పెంచాలని ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపకారవేతనాలు, బోధన ఫీజుల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించనుంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్సీ సంక్షేమశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2021-22 విద్యాసంవత్సరానికి ఉపకార గడువు అక్టోబరు 24తో ముగిసింది. గడువు ముగిసే నాటికి ఈ-పాస్‌లో రెన్యువల్‌ విద్యార్థులు 2.30 లక్షలు, కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు 10వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనా ప్రకారం ఇంకా 10 లక్షల మంది విద్యార్థులు దూరంగా ఉండిపోయారు. ఉపకారవేతనాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం, ప్రవేశాలు ఇంకా కొనసాగుతుండటంతో గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయారు. సంక్షేమశాఖల అంచనా మేరకు ఈ ఏడాదికి రెన్యువల్, కొత్త దరఖాస్తులు 12.5 లక్షలకు పైగా వస్తాయని భావిస్తోంది. లాక్‌డౌన్‌తో ఆలస్యంగా విద్యాసంస్థలు ప్రారంభం కావడం, వివిధ కోర్సులకు ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నందున కొంత కాలం గడువును పొడిగించాలని ఎస్సీ సంక్షేమశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదన మేరకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు, గడువు మరో మూణ్నెళ్లు పొడిగించే అవకాశాలున్నాయని సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ డీఆర్‌డీఓ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌స్టాఫ్‌

‣ డీఎస్‌ఐడీసీలో అప్రెంటిస్‌ ఖాళీలు

‣ బుల్లి విహంగాలకు కొత్త రెక్కలు

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు! 

‣ ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

Posted Date : 28-10-2021