• facebook
  • whatsapp
  • telegram

scholarship: మైనార్టీ విద్యార్థుల కేంద్ర ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్‌ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటి నుంచి పది వరకు చదువుతున్న ప్రీమెట్రిక్‌ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా, ఇంటర్‌ ఆ పైన చదివే పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు https://scholarships.gov.in/  పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకునేముందుగానే అర్హతలు పరిశీలించుకోవాలని సూచించింది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తరువాత అందులో మార్పులకు అవకాశం ఉండదని వెల్లడించింది. గత ఏడాది ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు ఆ ఉపకార దరఖాస్తు ఐడీతో ఈ ఏడాదికి రెన్యువల్‌ చేసుకోవాలని కోరింది. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.