• facebook
  • whatsapp
  • telegram

Btech seat: సీటు దక్కాలంటే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కీలకం

 

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌లో కోరుకున్న బ్రాంచ్‌, కళాశాల దక్కనివారు తదుపరి విడతల్లో మెరుగైన ఆప్షన్లు ఇచ్చుకొని ప్రయత్నించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటివారు కేటాయింపు  ఉత్తర్వు(అలాట్‌మెంట్‌ ఆర్డర్‌)లో పొందుపరిచిన ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తప్పకుండా చేయాలి. దానివల్ల తదుపరి విడతల్లో ఆశించిన సీటు పొందొచ్చు. ఒకవేళ రాకపోతే... కనీసం తొలి విడత సీటు ఉంటుంది.

 

* సీట్లు పొందినవారు సెప్టెంబర్‌ 23 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. రుసుం చెల్లించాక సీటు రద్దు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్‌ 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు చెల్లించిన ఫీజు పూర్తిగా తిరిగి చెల్లిస్తారని ఎంసెట్‌ క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు.

 

* అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగనుంది. తర్వాత 10 రోజుల్లో ఫలితాలు వస్తాయి. అనంతరం జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు నెలరోజుల పాటు  జోసా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ఇది పూర్తయ్యేవరకు ఆయా కళాశాలల్లో సీట్ల విషయంలో స్పష్టత రావడం కష్టం.
 

Posted Date : 19-09-2021