• facebook
  • whatsapp
  • telegram

జులై 1 నుంచి సీనియ‌ర్  ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు  

* ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డిజిటల్‌ గ్రంథాలయాలు

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచ్చారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. జులై 5 వరకు ప్రథమ సంవత్సరంలో మొదటి విడత ప్రవేశాలు జరుగుతాయని, ఈ క్రమంలో జూన్ 16 నుంచి కళాశాలలను సిద్ధం చేసుకొని జులై 1 నుంచి ద్వితీయ ఇంటర్‌కు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలను రెండు, మూడు విడతల్లో జరిపి తొలి ఏడాది విద్యార్థులకు కూడా దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేస్తామని చెప్పారు.

70 శాతం సిలబస్‌ ఆధారంగానే పాఠాలు...

2021 - 22 విద్యా సంవత్సరానికి 70% సిలబస్‌ నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేయనున్నారని తెలిసింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థులు కళాశాలల్లో పాఠాలు వినేందుకు డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు 200 ప్రైవేట్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చారు.
 

Posted Date : 14-06-2021