• facebook
  • whatsapp
  • telegram

Degree Results: శాతవాహన వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు ప్రకటించింది. అక్టోబరు 27న ఉపకులపతి ఆచార్య ఎస్‌.మల్లేశ్, పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్, ఓఎస్‌డీ వి.రమేశ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను www.satavahana.ac.in లో అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో 6వ సెమిస్టర్‌లో 79, 5వ సెమిస్టర్‌ 56శాతం ఉత్తీర్ణత సాధించగా 1వ సెమిస్టర్‌లో విద్యార్థులు వెనుకబడి పోయారు. కేవలం 34శాతం గట్టెక్కారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్‌ అబ్రరుల్‌ బాకీ, జయంతి, సరసిజ పాల్గొన్నారు. వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే... ఆరో సెమిస్టర్‌లో బీఏలో 76శాతం, బీకాంలో 78, బీఎస్సీలో 79, బీఏఎల్‌లో 92, బీబీఏలో 93శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 15,790 మందిలో 12,448 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,686 మంది విద్యార్థులు 9-10 సీజీపీఏ దక్కించుకున్నారు. 5వ సెమిస్టర్‌లో బీఏలో 57శాతం, బీకాంలో 61, బీఎస్సీలో 69, బీఏఎల్‌లో 47, బీబీఏలో 86శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. మొత్తం 16,707మందిలో 10,865మంది పాస్‌ అయ్యారు. ఇక ఒకటో సెమిస్టర్‌లో బీఏలో 27, బీకాంలో 31, బీఎస్సీలో 37, బీఏఎల్‌లో 39, బీబీఏ 55శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. మొత్తం 24,834మందిలో కేవలం 8,423 మంది ఉత్తీర్ణత పొందారు.

 

http://www.satavahana.ac.in/ExaminationResults.aspx

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఎన్‌సీటీఈ-న్యూదిల్లీలో అకడమిక్‌ కన్సల్టెంట్లు

‣ ఎయిమ్స్‌-నాగ్‌పూర్‌లో జూనియర్‌ రెసిడెంట్లు

‣ గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు

‣ ఆర్థిక శక్తికి సహకార యుక్తి

‣ నేర్చుకుందాం నిరంతరం!

Posted Date : 28-10-2021