• facebook
  • whatsapp
  • telegram

Spot admissions: 22 నుంచి సైనిక డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు 

 

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ సైనిక కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్‌ఈపీ కోర్సుల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో మిగిలిన 45 సీట్లను భర్తీ చేసేందుకు సెప్టెంబర్‌ 23 నుంచి 25 వరకు స్పాట్‌ అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి కళాశాలలో పరీక్షలు ఉంటాయని.. విద్యార్థినులు స్పోర్ట్స్‌ డ్రెస్, షూస్‌తో హాజరు కావాలని కోరారు. విద్యార్థినుల కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలని, వివరాలకు 9182709884 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 

Posted Date : 22-09-2021