• facebook
  • whatsapp
  • telegram

Convocation: శ్రీ వేంకటేశ్వర వేదవర్సిటీ స్నాతకోత్సవం నేడు 

తిరుపతి(సాంస్కృతికం): శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ శోభను సంతరించుకుంది. వర్సిటీలోని యాగశాలలో అక్టోబరు 28న ఉదయం 11.30 గంటలకు 6వ స్నాతక వేడుకలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 122 మందికి బ్యాచిలర్‌ డిగ్రీ, 46 మందికి మాస్టర్‌ డిగ్రీ, ఇద్దరికి ఎంఫిల్, 11 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందజేయనున్నారు. ప్రసిద్ధ వేదపండితుడు బ్రహ్మశ్రీ గణేశన్‌ శ్రౌతికి మహామహోపాధ్యాయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ పేర్కొన్నారు.

Posted Date : 28-10-2021