• facebook
  • whatsapp
  • telegram

SSC CHSL Results 2020: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 పరీక్ష ఫలితాలు విడుదల

* 4685 మంది అభ్యర్థుల ఎంపిక
 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) 2020 తుది ఫలితాలు డిసెంబర్‌ 7న విడుదలయ్యాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 4791 లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ తదితర పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్‌-1, 2, స్కిల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 4685 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన/ ఎంపికకాని అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలు డిసెంబర్‌ 14న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు, ఇది డిసెంబర్‌ 28 వరకు అందుబాటులో కమిషన్ పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. 

 

ప్రకటన వివరాలు
 

ఫలితాలు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.