‣ 24,369 నుంచి 45,284 కొలువులు పెంచుతూ ప్రకటన
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. తొలుత నియామక ప్రకటన విడుదల సమయంలో మొత్తం ఖాళీలను 24,369గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను 45,284కు పెంచుతూ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో అదనంగా 20,915 ఉద్యోగాలు చేరాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)లో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించనుంది.
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కంటెంట్ ఉంటే... క్రియేటర్లు మీరే!