• facebook
  • whatsapp
  • telegram

Campus Placements: ప్రాంగణ నియామకాల్లో విద్యార్థుల ప్రతిభ 

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: అపూర్వ డిగ్రీ కళాశాలలో ఐదు రోజులుగా నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 400పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని కళాశాల ఛైర్మన్‌ పి.వేణు తెలిపారు. సెప్టెంబర్‌ 18న ప్లేస్‌మెంట్‌ సాధించిన విద్యార్థులను అభినందించారు. విప్రో, ఫినోబ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, న్యూఫోర్స్‌ వంటి కంపెనీల్లో 280 మంది విద్యార్థులు 400పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ పి.అనిల్‌ కుమార్, ప్రిన్సిపాళ్లు వి.వి మనోహర్‌రెడ్డి, కె.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 19-09-2021