• facebook
  • whatsapp
  • telegram

Teachers: జనవరి మొదటి వారంలో ఉపాధ్యాయుల బదిలీలు!

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు జనవరి మొదటి వారంలో బదిలీలు ఉంటాయని పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడు వెల్లడించినట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్‌ సుధీర్‌బాబు తెలిపారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిర్వహిస్తామన్నారని పేర్కొన్నారు. అంతర జిల్లా బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, వచ్చిన వెంటనే బదిలీలు ప్రక్రియ ఉంటుందన్నారు. నవంబరు మొదటి వారంలో మరోసారి ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్‌ ఇస్తామని, ఈ సమయంలో గతంలో బ్లాక్‌ చేసిన పోస్టులన్నింటినీ చూపుతామని తెలిపారని వెల్లడించారు.

Posted Date : 26-10-2021